David Warner: ప్రయత్నిస్తున్నాను సర్... పూరీ జగన్నాథ్ కు బదులిచ్చిన డేవిడ్ వార్నర్

David Warner replies to Puri Jagannadh tweet
  • టిక్ టాక్ వీడియోలతో అలరిస్తున్న వార్నర్
  • ఇటీవల బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్
  • తాజాగా పోకిరి సినిమాలో డైలాగ్ తో వీడియో
  • గెస్ట్ రోల్ ఆఫర్ చేసిన పూరీ
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ సినిమా రంగంపై మోజు ప్రదర్శిస్తున్నాడు. ఇటీవలే బుట్టబొమ్మ పాటకు టిక్ టాక్ వీడియో చేసిన ఈ ఎడమచేతివాటం ఓపెనర్ తాజాగా పోకిరి చిత్రంలో మహేశ్ బాబు హిట్ డైలాగ్ ఒక్కసారి కమిటైతే అంటూ మరో వీడియో చేశాడు. దీనిపై స్పందించిన పోకిరి చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్ వార్నర్ నటన బాగుందని, తన చిత్రంలో ఓ అతిథి పాత్ర ఇస్తానంటూ ఆఫర్ చేశాడు. పూరీ ఆఫర్ పట్ల డేవిడ్ వార్నర్ వెంటనే స్పందించాడు.

"నేను కూడా ప్రయత్నిస్తున్నాను సర్. అయితే, సన్ రైజర్స్ ఫ్రాంచైజీ నన్ను వదులుకుంటుందో లేదో చూడాలి. లేకపోతే సన్ రైజర్స్ నుంచి నన్ను విడిపించేందుకు మీరే ఏదైనా బేరం కుదుర్చుకోవాలి" అంటూ చమత్కరించాడు. వార్నర్ ఐపీఎల్ లో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో కాంట్రాక్టులో ఉన్న సంగతి తెలిసిందే.
David Warner
Puri Jagannadh

More Telugu News