David Warner: 'పోకిరి' డైలాగ్ చెప్పిన డేవిడ్ వార్నర్... అతిథి పాత్ర ఆఫర్ చేసిన పూరీ జగన్నాథ్

David Warner enthrall with Pokiri dialogue
  • 'ఒక్కసారి కమిటైతే' డైలాగ్ తో అదరగొట్టిన వార్నర్
  • ఈ డైలాగ్ వార్నర్ కు బాగా సరిపోతుందన్న పూరీ
  • 'లవ్యూ' అంటూ అభినందనలు
వరస చూస్తుంటే ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు టాలీవుడ్ పిచ్చి పట్టినట్టుంది! మొన్నటికి మొన్న అల్లు అర్జున్ హిట్ సాంగ్ 'బుట్టబొమ్మ' పాటకు టిక్ టాక్ వీడియోలో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన వార్నర్... ఇప్పుడు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ 'పోకిరి' చిత్రంలోని సూపర్ హిట్ డైలాగ్ తో అదరగొట్టాడు.

"ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పాడు. "ఇది ఏ సినిమా డైలాగ్ అని అందరినీ అడిగాను" అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై పోకిరి చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. "డేవిడ్... ఈ డైలాగ్ నీకు సరిగ్గా సరిపోతుంది. మొండిపట్టుదల, దూకుడు కలగలిసిన వ్యక్తివి నీవు. నటుడిగానూ నువ్వు సూపరబ్బా. నా చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషిస్తావని అనుకుంటున్నా. లవ్యూ వార్నర్" అంటూ ట్వీట్ చేశారు.
David Warner
Pokiri
Puri Jagannadh
TikTok
Tollywood

More Telugu News