America: అమెరికాలో కొనసాగుతున్న కరోనా మరణాలు.. 24 గంటల్లో 1,500 మందికి పైగా మృతి

1500 Coronavirus Deaths In US In 24 Hours
  • ఒక్క రోజు వ్యవధిలో 1,568 మంది మృతి
  • 13 లక్షలు దాటేసిన కరోనా కేసులు
  • న్యూయార్క్, న్యూజెర్సీలలో అత్యధిక కేసులు
అమెరికాలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1,568 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78,746కు పెరిగినట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

అలాగే, 13,09,164 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు మూడున్నర లక్షల కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, 26,771 మంది  ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉంది. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది ఇక్కడే. ఇప్పటి వరకు ఇక్కడ 1,38,579 కేసులు నమోదు కాగా, 9,118 మంది ప్రాణాలు కోల్పోయారు.
America
Newyork
Corona Virus

More Telugu News