Hyderabad: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వలస కూలీల దుర్మరణం

5 migrant labour dead in Madhya Pradesh
  • హైదరాబాద్ నుంచి మామిడిపండ్ల లోడుతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న లారీ
  • నర్సింగ్‌పూర్ జిల్లా పరా వద్ద బోల్తాపడిన లారీ
  • తీవ్రంగా గాయపడిన మరో 11 మంది
మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వలస కూలీలు దుర్మరణం పాలయ్యారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి మామిడిపండ్ల లోడుతో ఉత్తరప్రదేశ్‌కు వెళ్తున్న లారీలో కొందరు వలస కూలీలు ఎక్కారు. లారీ నర్సింగ్‌పూర్ జిల్లా పరా వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.

ఈ ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన 11 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కూలీలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
Madhya Pradesh
Migrant Labour
Road Accident

More Telugu News