Hyderabad: మండే ఎండలో వలస కూలీల నరకయాతన.. ట్రక్కులో హైదరాబాద్ నుంచి చత్తీస్‌గఢ్‌కు పయనం!

  • ట్రక్కులో బయలుదేరిన దాదాపు 20 మంది కూలీలు
  • ఎండకు అలమటించి పోయిన మహిళలు, చిన్నారులు
  • తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు
Migrant Labour went Chhattisgarh from Hyderabad on Truck

వలస కూలీల నరకయాతనకు ఇది నిదర్శనం. మండే ఎండల్లో ఎత్తికుదిపేసే ట్రక్కులో హైదరాబాద్ నుంచి వలస కూలీల బృందం 800 కిలోమీటర్ల దూరంలోని చత్తీస్‌గఢ్ బయలుదేరింది. పొట్ట కూటి కోసం చత్తీస్‌గఢ్ నుంచి హైదరాబాద్ వచ్చిన వీరంతా లాక్‌డౌన్ నేపథ్యంలో ఎలాగోలా ఇల్లు చేరాలన్న ఉద్దేశంతో ట్రక్కును ఎంచుకున్నారు.

దాదాపు 20 మంది వరకు ఉన్న ఈ బృందంలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. పై నుంచి ఎండ సర్రున కాలుస్తుంటే మరో మార్గం లేని వారంతా బాధను అదిమిపెట్టుకుని కూర్చున్నారు. ఆకలి, ఎండవేడిమికి తాళలేక చిన్నారులు అలమటించిపోయారు. తినడానికి తిండిలేక, తాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడ్డారు. వీరిని చూసిన కొందరి మనసులు తర్కుకుపోయాయి. మరికొన్ని గంటల్లో స్వస్థలాలకు చేరుకుంటామన్న ఆనందం వారిని బాధను భరించేలా చేసింది.

More Telugu News