Corona Virus: కరోనా రోగుల డిశ్చార్జ్ నిబంధనలను మార్చిన కేంద్రం!

  • 7 రోజుల హౌమ్ ఐసొలేషన్ పాటించాల్సిందే
  • ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ లో నెగటివ్ రావాలి
  • మూడు రోజులు జ్వర లక్షణాలు కనిపించరాదు
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
New Guidelines on Corona Patients Discharge

కరోనా వైరస్ సోకి, కోలుకుని ఇంటికి వెళుతున్న వారు పాటించాల్సిన నిబంధనలను కేంద్రం సడలించింది. తాజాగా, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు, రోగులు కోలుకున్న తరువాత, తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయాలి. దానిలో నెగటివ్ వస్తేనే ఇంటికి వెళ్లేందుకు అర్హులని స్పష్టం చేసింది.

ఇక స్వల్పంగా లక్షణాలున్న వారికి చికిత్స తరువాత, 10 రోజుల పాటు జలుబు, దగ్గు లేకుండా ఉండాలని, కనీసం మూడు రోజుల పాటు జ్వరం రాకూడదని అప్పుడే వారిని డిశ్చార్జ్ చేయవచ్చని వెల్లడించింది. ఇంటికి వెళ్లే ఎవరైనా వారం రోజులపాటు హోమ్ ఇసొలేషన్ తప్పనిసరిగా పాటించాలని కూడా ఆదేశించింది.

ఇంటికి వెళ్లిన తరువాత మరోసారి జ్వరం, దగ్గు వంటివి సంభవిస్తే, వెంటనే కొవిడ్ కేర్ సెంటర్ లేదా స్టేట్ హెల్ప్ లైన్ 1075ను సంప్రదించాలని సూచించింది. డిశ్చార్జ్ అయిన వారి ఆరోగ్య వివరాలను టెలీ కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులు పర్యవేక్షిస్తుంటారని వెల్లడించింది.

More Telugu News