Chandrababu: నల్లపురెడ్డిని పిచ్చాసుపత్రిలో చేర్పించాలి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి

Nallapureddy should be joined in Mental Hospital says Polamreddy Srinivasulu Reddy
  • కోటి రూపాయల పరిహారం గురించి చంద్రబాబు విమర్శించలేదు
  • ఎల్జీ కంపెనీపై వైసీపీ ప్రభుత్వ తీరునే విమర్శించారు
  • కోవూరు నియోజకవర్గం పరువు తీస్తున్నారు
వైజాగ్ గ్యాస్ లీకేజ్ ఘటన నేపథ్యంలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు ఎప్పుడైనా కోటి రూపాయల పరిహారం ఇచ్చారా? అంటూ వైసీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు కోవూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కౌంటర్ ఇచ్చారు. నల్లపురెడ్డిని వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించాలని... ఈ విషయంలో ఆయన తల్లి చొరవ చూపించాలని అన్నారు.

వైజాగ్ ఘటనపై నల్లపురెడ్డికి కనీస అవగాహన కూడా లేదని పోలంరెడ్డి  ఎద్దేవా చేశారు. కోటి రూపాయల పరిహారం గురించి చంద్రబాబు విమర్శించలేదని... ఎల్జీ పాలిమర్స్ కంపెనీ మీద రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఉదార స్వభావాన్నే విమర్శించారని అన్నారు. దిగజారుడు భాషను ఉపయోగిస్తూ... కోవూరు నియోజకవర్గ పరువు తీస్తున్నాడని దుయ్యబట్టారు.
Chandrababu
Polam Reddy
Nallapureddy
YSRCP
Telugudesam

More Telugu News