Bandla Ganesh: నారా లోకేశ్ సర్... మీ నుంచి మేం ఆశిస్తున్నది ఇదే: బండ్ల గణేశ్

Bandla Ganesh responds Nara Lokesh tweet
  • ఇటీవల లోకేశ్ పై బండ్ల గణేశ్ విమర్శలు
  • తాజాగా మరోసారి ట్వీట్
  • లోకేశ్ ట్వీట్ పై స్పందించిన వైనం
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కొన్నిరోజుల కిందట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై విమర్శనాత్మక ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన లోకేశ్ ను ప్రస్తావిస్తూ మరో ట్వీట్ చేశారు. 'నారా లోకేశ్ సర్... మీ నుంచి మేం కోరుకుంటున్నది ఇదే' అంటూ వ్యాఖ్యానించారు. లోకేశ్ చేసిన ఓ ట్వీట్ ను కూడా జతచేశారు. ఆ ట్వీట్ లో లోకేశ్ వైజాగ్ గ్యాస్ లీక్ బాధితుల పక్షాన స్పందించడం చూడొచ్చు. మృతురాలు గ్రీష్మ తల్లి ధన కడుపుకోత ఓసారి చూడండి అంటూ ఆవేదనాభరితమైన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియో ట్వీట్ పైనే బండ్ల గణేశ్ పైవిధంగా స్పందించారు.
Bandla Ganesh
Nara Lokesh
Vizag Gas Leak
Vizag
Andhra Pradesh

More Telugu News