Pawan Kalyan: ఇటువంటి నిరసనల్లో పాల్గొనకండి: 'జనసేన' విశాఖ కార్యకర్తలకు పవన్ కల్యాణ్ విన్నపం

  • జనసేన నేతలు, జనసైనికులకు నేనొక విన్నపం చేస్తున్నాను 
  • బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టండి
  • ఆందోళనలు చేయడానికి ఇది సరైన సమయం కాదు
  • వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉంది
In times of Corona Pandemic we should  focus  on helping Gas Victims  not doing agitations

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటనపై స్థానికులు నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇందులో పాల్గొనవద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు.

'జనసేన నేతలు, జనసైనికులకు నేనొక విన్నపం చేస్తున్నాను. ఇటువంటి నిరసనల్లో పాల్గొనకండి. దయచేసి బాధితుల కుటుంబాలకు సాయం చేయడంపైనే దృష్టి పెట్టండి. ఆందోళనలు చేయడానికి ఇది సరైన సమయం కాదు. గ్యాస్‌ లీక్ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తుది నివేదికలు అందేవరకు వేచి చూద్దాం' అని చెప్పారు.

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాజకీయ పార్టీల కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలతో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో వైరస్‌ కట్టడి విషయం మన చేతుల నుంచి జారిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సాయం చేయడంపైనే దృష్టి పెట్టాలని నిరసనలపై కాదని ఆయన చెప్పారు.

More Telugu News