Pawan Kalyan: టీవీ5 ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి ఓ దుష్టచర్య: పవన్ కల్యాణ్

Pawan Kalyan condemns stone pelting on a tv channel
  • గత అర్ధరాత్రి హైదరాబాదులో టీవీ5 ఆఫీసుపై దాడి
  • దాడి విషయం తెలిసి చింతించానన్న పవన్
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
హైదరాబాదులోని టీవీ5 చానల్ ప్రధాన కార్యాలయంపై గత అర్ధరాత్రి కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం రాత్రి టీవీ5 ఆఫీసుపై రాళ్లతో దాడి చేశారని తెలిసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి దుష్ట చర్యలు మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని పవన్ ట్వీట్ చేశారు. టీవీ5 చానల్ యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని పేర్కొన్నారు.
Pawan Kalyan
TV5
Stone Pelting
Hyderabad

More Telugu News