India: భారత్ లో జూలైలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసులు పెరుగుతాయి
  • ఆ తర్వాత వైరస్ విస్తరణ కట్టడి అవుతుంది
  • భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలనిచ్చింది
India registers highest number of corona cases in july says WHO

కరోనా కట్టడి విషయంలో భారత్ చాలా వేగంగా చర్యలు తీసుకుందని మన దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) రాయబారి డేవిడ్ నబారో ప్రశంసించారు. సకాలంలో స్పందించడం వల్ల కేసులను తక్కువ సంఖ్యకే పరిమితం చేశారని అన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత కేసుల సంఖ్య కొంత కాలం పెరుగుతుందని చెప్పారు. జూలై నెలలో కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని అన్నారు. అంతకు ముందు కొన్ని రోజుల పాటు కేసుల నమోదు స్థిరంగా ఉంటుందని చెప్పారు. అయినా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కేసులు పెరిగినా క్రమంగా వైరస్ విస్తరణ కట్టడి అవుతుందని చెప్పారు.

భారత్ లో లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని నబారో తెలిపారు. దేశంలోని భారీ జనాభాతో పోలిస్తే నమోదైన కేసుల సంఖ్య చాలా తక్కువేనని చెప్పారు. భారత్ లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల మరణాల రేటు కూడా తక్కువగా ఉందని అన్నారు. డబ్ల్యూహెచ్ఓపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... ఓ దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి ఆరోపణలు గుప్పించినంత మాత్రాన కరోనా వైరస్ పై చేస్తున్న పోరు ఆగిపోదని చెప్పారు. కరోనా కట్టడి చేసే లక్ష్యం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.

More Telugu News