Corona Virus: 216 జిల్లాల్లో కరోనా జాడే లేదు!

More districts in country have not corona positive cases
  • భారత్ లో 56,342కి చేరిన కరోనా కేసులు
  • 42 జిల్లాల్లో 28 రోజులుగా కరోనా కేసులు నిల్
  • 29 జిల్లాల్లో 21 రోజులుగా కరోనా కేసుల్లేని వైనం
భారత్ లో కరోనా వ్యాప్తి కేవలం కొన్ని ప్రాంతాల్లోనే అత్యధికంగా నమోదవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు భారత్ లో 56,342 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,886 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో 3,390 కేసులు నమోదయ్యాయి.

దీనిపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, దేశంలో 216 జిల్లాల్లో కరోనా ఉనికి లేదని, అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు. గత 28 రోజులుగా 42 జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని, 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు లేవని వివరించారు. 36 జిల్లాల్లో 14 రోజులుగా ఎవరికీ కరోనా నిర్ధారణ కాలేదని, 46 జిల్లాల్లో గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులేవీ రాలేదని తెలిపారు.
Corona Virus
India
Positive Cases
COVID-19
Districts

More Telugu News