Bihar: రైసు మిల్లుల్లో పనిచేయడానికి.. బీహార్ నుంచి తెలంగాణకు చేరుకున్న వలస కూలీలు

Bihar migrant labour  reaches Hyderabad
  • బీహార్ నుంచి వచ్చిన 225 మంది కూలీలు
  • బీహార్ కు వెళ్లిన శ్రామిక్ రైలు తిరుగు ప్రయాణంలో వీరి రాక 
  • వైద్య పరీక్షల అనంతరం రైసు మిల్లులకు తరలింపు
తెలంగాణ రైస్ మిల్లుల్లో పని చేయడానికి బీహార్ నుంచి 225 మంది వలస కూలీలు వచ్చారు. వీరంతా హైదరాబాదులోని లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వీరిని రాష్ట్రంలోని కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, జగిత్యాల, సిద్ధిపేట, కామారెడ్డి, మంచిర్యాల, మిర్యాలగూడ, సుల్తానాబాద్ తదితర జిల్లాలకు ప్రత్యేక బస్సుల్లో ప్రభుత్వం తరలిస్తోంది. అందరీకి వైద్య పరీక్షలను నిర్వహించిన అనంతరం రైసు మిల్లులకు తరలించనున్నారు. తెలంగాణ నుంచి బీహార్ కు శ్రామిక్ రైల్లో కూలీలు వెళ్లిన సంగతి తెలిసిందే. రైలు తిరుగు ప్రయాణంలో కొత్త కూలీలు హైదరాబాదుకు చేరుకున్నారు.
Bihar
Migrant Labour
Telangana

More Telugu News