Jagan: ప్రధాన బీమా సంస్థలకు సీఎం జగన్ లేఖ

CM Jagan writes to LIC and United India Insurance companies
  • ఎల్ఐసీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలకు లేఖ
  • లాక్ డౌన్ తో ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని వెల్లడి
  • పెండింగ్ క్లెయిమ్సు సత్వరమే పరిష్కరించాలని విజ్ఞప్తి
ఏపీ సీఎం జగన్ ఎల్ఐసీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థలకు లేఖ రాశారు. ఆయా సంస్థల చైర్మన్లు ఎంఆర్ కుమార్, గిరీశ్ రాధాకృష్ణన్ లను ఉద్దేశించి రాసిన ఆ లేఖల్లో... ప్రధాని జనజీవన్ బీమా, ఆమ్ ఆద్మీ బీమా యోజన క్లెయిమ్సు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని సురక్ష బీమా యోజన పెండింగ్ క్లెయిమ్సు సత్వరమే పరిష్కరించాలని కోరారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా మారిందని, అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని లేఖలో వివరించారు. సంబంధిత క్లెయిమ్సు వెంటనే చెల్లించాలని  పేర్కొన్నారు.
Jagan
LIC
United India Insurance
Lockdown
Claims

More Telugu News