కర్ణాటక సీఎంకు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు

  • కర్ణాటకలోని ఉడిపిలో చిక్కుకుపోయిన ఏపీ మత్స్యకారులు
  • సీఎం ఆదుకుంటున్నారని ట్వీట్ చేసిన చంద్రబాబు
  • బీజేపీ నేత శోభా కరంద్లాజేకు చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు
Chandrababu offers heartfelt thanks to Karnataka CM

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. తన విజ్ఞప్తి మేరకు... ఉడిపి ప్రాంతంలో చిక్కుకుపోయిన 300కి పైగా ఏపీ మత్స్యకారులను ఆదుకుంటున్నారని ప్రశంసించారు.

ఈ విషయంలో వేగంగా స్పందించిన బీజేపీ నేత శోభా కరంద్లాజేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. కాగా, కర్ణాటక నుంచి ఏపీ వచ్చే ఈ మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేర్చేంతవరకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా చూసేందుకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయడు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఉత్తరాంధ్ర నుంచి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలకు వలస వెళ్లి లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

More Telugu News