Yash: భారీ రేటుకు 'కేజీఎఫ్ 2' డిజిటల్ రైట్స్

KGF 2 Movie
  • సంచలన విజయాన్ని సాధించిన 'కేజీఎఫ్'
  • చాప్టర్ 1 డిజిటల్ హక్కులు 18 కోట్లు
  • 'కేజీఎఫ్ 2' డిజిటల్ హక్కులు 55 కోట్లు  
యశ్ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 1' సినిమా సంచలన విజయాన్ని సాధించింది.  కన్నడతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా భారీ విజయాలను నమోదు చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వారు 18 కోట్లకు దక్కించుకున్నారు.  ఓ కన్నడ చిత్రం డిజిటల్ హక్కులు ఈ స్థాయి రేటుకు అమ్ముడవడం అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆ సినిమాకి  ఇపుడు సీక్వెల్ రూపొందుతోంది. 'కేజీఎఫ్ 2' టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ .. రవీనా టాండన్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. ఫస్టు పార్టు సంచలన విజయాన్ని సాధించడం వలన .. రెండవ పార్టులో భారీ తారాగణం వలన డిజిటల్ రైట్స్ రేటు విషయంలో గట్టిపోటీ ఏర్పడిందట. అమెజాన్ ప్రైమ్ వారే అన్ని భాషలకి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్నారట. ఇందుకుగాను 55 కోట్లను చెల్లించినట్టు సమాచారం. ఓ దక్షిణ భారత చిత్రానికి డిజిటల్ హక్కులు ఈ స్థాయిలో పలకడం విశేషం.
Yash
Sanjay Dutt
Raveena
KGF 2 MOvie

More Telugu News