Central Team: ఏపీలో కరోనా పరిస్థితుల పరిశీలనకు విచ్చేసిన కేంద్ర బృందం 

Central team visited AP to assess corona situations
  • రాష్ట్రాలతో సమన్వయం కోసం ప్రత్యేక బృందాలు
  • ఏపీ ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశం
  • రాష్ట్రంలో కరోనా వివరాలు తెలిపిన ఉన్నతాధికారులు
రాష్ట్రాల్లో కరోనా వాస్తవ పరిస్థితుల మదింపు, రాష్ట్రాలతో సమన్వయం కోసం కేంద్రం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నుంచి ఓ బృందం ఏపీలో అడుగుపెట్టింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు జరుగుతున్న తీరు, ఇతర అంశాలను అధికారులు ఆ బృందానికి వివరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ భాస్కర్ కాటమనేని, స్పెషల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం జవ్వాది కేంద్ర బృందంతో సమావేశమై వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని వివరాలు సమర్పించారు.
Central Team
Andhra Pradesh
Corona Virus
COVID-19
Lockdown

More Telugu News