Liquor Sales: మద్యం అమ్మకాలను నిషేధించలేం.. ఈ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

We can not order states to stop liquor sales says Supreme Court
  • మద్యం అమ్మకాలు రాష్ట్రాల విధానపరమైన నిర్ణయం
  • ఈ విషయంలో జోక్యం చేసుకోలేం
  • అమ్మకాలకు ఆన్ లైన్ విధానాన్ని అనుసరించాలి
లాక్ డౌన్ కారణంగా దాదాపు 40 రోజుల తర్వాత దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో లిక్కర్ షాపులకు మందుబాబులు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మద్యం కొనుగోళ్ల సమయంలో భౌతికదూరాన్ని కూడా పాటించడం లేదని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.

ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం అమ్మకాలు రాష్ట్రాల విధానపరమైన నిర్ణయాలని... అమ్మకాలను తాము నిషేధించలేమని, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. అయితే మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలకు సూచించింది. మద్యం అమ్మకాలకు ఆన్ లైన్ విధానాన్ని అనుసరించాలని... ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్నవారికి డోర్ డెలివరీ చేయాలని చెప్పింది.
Liquor Sales
Ban
Supreme Court

More Telugu News