Donald Trump: చైనాలో ఘోరమైన పొరపాటు చేసుంటారు: ట్రంప్

Trump once again lashes out China
  • కరోనా అంశంలో చైనాను తప్పుబడుతున్న ట్రంప్
  • చైనా చేతకానితనం అంటూ విమర్శలు
  • మొత్తానికి ఏదో జరిగిందంటూ వ్యాఖ్యలు
కరోనా వైరస్ ప్రపంచదేశాలకు వ్యాపించడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ చైనాను తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. మరోసారి ట్రంప్ అదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. కరోనా విషయంలో చైనాలో ఏదో ఘోరమైన పొరపాటు జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.

చైనా తప్పిదమో, లేక చేతకానితనమో... ఇప్పుడు యావత్ ప్రపంచం బాధపడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ను చైనా ఏదో ఒక దశలో నియంత్రించే వీలున్నా అలా జరగలేదని అన్నారు. అసలు, కరోనాను దాని మూలం వద్దే నిలిపివేసే అవకాశం ఉంది, కానీ ఏదో జరిగింది అంటూ సందేహం వెలిబుచ్చారు. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Donald Trump
China
Corona Virus
COVID-19
USA

More Telugu News