Riyaz Nykoo: రియాజ్ నైకూ హతమవడంతో సైఫుల్లాకు బాధ్యతలు.. వేట మొదలుపెట్టిన భద్రతాబలగాలు!

Saifullah  apponted as new commander for Hizbul
  • రెండు రోజుల క్రితం నైకూను మట్టుబెట్టిన బలగాలు
  • కొత్త కమాండర్ సైఫుల్లా కోసం గాలింపు
  • నాలుగు నెలల్లో 70కి పైగా ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్ హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ నైకూను రెండు రోజుల క్రితం భారత భద్రతాబలగాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిజ్బుల్ కొత్త కమాండర్ గా సైఫుల్లాను నియమించారు. ఈ సమాచారం అందిన వెంటనే సైఫుల్లా కోసం భద్రతా బలగాలు వేట మొదలుపెట్టాయి.

 సైఫుల్లా దక్షిణ కశ్మీర్ లో ఇంతకాలం ఉన్నాడు. ఏ ప్లస్ ప్లస్ కేటగిరీలో ఉన్న కరుడుగట్టిన ఉగ్రవాదిగా పేరుంది. భద్రతా బలగాల కాల్పుల్లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించే బాధ్యతలను ఇంతకాలం సైఫుల్లా చూసుకున్నాడు. మరోవైపు, గత నాలుగు నెలల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
Riyaz Nykoo
Saifullah
Hizbul
Jammu And Kashmir

More Telugu News