Kim Jong Un: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రశంసల జల్లు

 Kim Jong Un sends warm greetings to Chinas Xi
  • కరోనాపై విజయం సాధించినందుకు అభినందనలు
  • ఈ మేరకు సందేశం పంపిన కిమ్
  • వివరాలు వెల్లడించిన ఉత్తరకొరియా మీడియా

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై ఉత్తర కొరియా అధ్యక్షుడు‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కరోనాపై పోరాటంలో విజయం సాధించినందుకు జిన్‌పింగ్‌కు కిమ్‌ అభినందనలు తెలిపారని ఉత్తరకొరియా మీడియా పేర్కొంది. జిన్ పింగ్ ఆరోగ్యంగా ఉండాలని కిమ్ ఆకాంక్షించారని చెప్పింది.

సమర్థుడైన జిన్‌పింగ్‌ నాయకత్వంలోని చైనీస్‌ పార్టీ, చైనా ప్రజలు కరోనా‌పై పైచేయి సాధించారని కిమ్ ప్రశంసలు కురిపించారని తెలిపింది. కరోనాను కట్టడి చేసిన తీరుపై అభినందనలు తెలుపుతూ జిన్‌ పింగ్‌కు కిమ్‌ ఓ సందేశాన్ని పంపారని వివరించింది. కాగా, 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి, తిరిగి వచ్చిన అనంతరం కిమ్ జోంగ్‌ ఉన్ చైనాకు ఈ సందేశాన్ని పంపారు.  

  • Loading...

More Telugu News