Adilabad District: ఆదిలాబాద్‌లో పురుగుల మందుతాగి ప్రేమ జంట ఆత్మహత్య

lovers suicide in adilabad
  • నార్నూర్ మండలం కంపూర్‌లో ఘటన
  • మృతులు గణేశ్, సీతా బాయిగా గుర్తింపు
  • లాక్‌డౌన్‌కు ముందు వారిద్దరి వివాహ నిశ్చితార్థం
  • లాక్‌డౌన్‌ కారణంగా వివాహం వాయిదాతో మనస్తాపం
వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. కలిసి జీవితాంతం బతకాలనుకున్నారు.. పెద్దలను ఒప్పించి పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు. కానీ, విధి వారిని వెక్కిరించింది. కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది. ఇక తమ పెళ్లి జరగదని భావించి ఆ యువతీయువకులు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్ మండలం కంపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతులు కన్నాపూర్‌కు చెందిన గణేశ్, కంపూర్‌కు చెందిన సీతా బాయిగా గుర్తించినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు వారిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా వివాహాన్ని వాయిదా వేసుకోవాలని పెద్దలు సూచించారు. దీంతో ఆ ప్రేమికులు తీవ్ర మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడ్డారు.
Adilabad District
Crime News

More Telugu News