Maharashtra: ముంబై ఆర్థర్ రోడ్డు జైలులో కలకలం.. 103 మందికి కరోనా

At least 72 inmates at Mumbai Arthur Road Jail test corona positive
  • బాధితుల్లో 77 మంది ఖైదీలు.. మిగతా వారు జైలు సిబ్బంది
  • బాధితులను రెండు ఆసుపత్రులకు తరలించిన అధికారులు
  • 11 వేల మంది ఖైదీలను విడిచిపెట్టాలని ‘మహా’ ప్రభుత్వం నిర్ణయం
కోవిడ్-19తో అల్లాడుతున్న ముంబైలో మరో కలకలం రేగింది. ఆర్థర్‌ రోడ్డు జైలులో ఏకంగా 103 మందికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 77 మంది అండర్ ట్రయల్ ఖైదీలు కాగా, మిగతా వారు జైలు సిబ్బంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే ఈ ఉదయం బాధితులందరినీ ముంబైలోని సెయింట్ జార్జ్,  గోకుల్ తేజ్ ఆసుపత్రులకు తరలించారు. డ్రగ్ స్మగ్లింగ్ కేసులో ఇటీవల ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. అతడికి కరోనా వైరస్ సోకి ఉంటుందని, అతడి నుంచి మిగతా వారికి అది సంక్రమించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

800 మంది మాత్రమే ఉండాల్సిన ఆర్థర్ రోడ్డు జైలులో ప్రస్తుతం 2600 మంది ఖైదీలు ఉండడంతో కిక్కిరిసిపోయింది. దీంతో కొత్త ఖైదీలను తీసుకునేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. జైళ్లలో వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో చిన్న నేరాలతో జైలుకు వచ్చిన 11 వేల మందిని విడుదల చేయాలని నిర్ణయించినట్టు మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.
Maharashtra
Arthur Road Jail
Mumbai

More Telugu News