Telangana: తెలంగాణ సిటీ బస్సుల్లో ఇక నో స్టాండింగ్.. ఓన్లీ సిటింగ్!

In Telangana changes will occur in public transport
  • పూర్తిగా మారిపోనున్న ప్రజా రవాణా ముఖచిత్రం
  • శానిటైజ్ చేసిన తర్వాతే రోడ్లపైకి బస్సులు
  • మెట్రో రైళ్లలో సగానికి తగ్గనున్న ప్రయాణికుల సంఖ్య
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేసింది. పరిస్థితులు కొలిక్కి వచ్చి రవాణాను తిరిగి ప్రారంభిస్తే తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.  లాక్‌డౌన్‌ కారణంగా మెట్రో రైలు రూ.100 కోట్లు, ఆర్టీసీ రూ.120 కోట్ల మేర నష్టపోయాయి.

ఇక మెట్రో రైలులో మూడు బోగీల్లో కలిపి 900 మంది ప్రయాణించే వీలుండగా, ఇకపై అతి కొద్ది మందితోనే అంటే దాదాపు సగం మందితోనే రైళ్లను నడపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ప్రయాణికులు నిల్చునేందుకు తెలుపు రంగుతో సర్కిళ్లు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందజేయడంతోపాటు మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించనున్నారు.

ఇక, ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే, ఇకపై స్టాండింగ్ జర్నీ (నిలబడి ప్రయాణించడం)కి చెక్ చెప్పాలని అధికారులు నిర్ణయించినట్టు చెబుతున్నారు. అలాగే, సిటీ బస్సులకు రెండువైపులా డోర్లు ఏర్పాటు చేయాలని, శానిటైజ్ చేసిన తర్వాత బస్సులను రోడ్లపైకి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం కోసం ఇద్దరు కూర్చునే సీట్లలో ఒక్కరిని, ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరిని మాత్రమే అనుమతించనున్నారు.
Telangana
City buses
Metro rail
Corona Virus

More Telugu News