Tirumala: టీటీడీ చరిత్రలో తొలిసారి... వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫైనాన్స్ కమిటీ సమావేశం!

  • 50 రోజులుగా భక్తులకు దర్శనాల నిలిపివేత
  • తగ్గిన ఆదాయం, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు అవరోధాలు
  • వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించిన అధికారులు
Video Conference of TTD Finance Committee

తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొలిసారిగా ఫైనాన్స్ కమిటీ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. పద్మావతి అతిథిగృహం నుంచి టీటీడీ అధికారులతో పాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితుడు భూమన కరుణాకరరెడ్డి పాల్గొనగా, కమిటీ సభ్యులైన రాజేష్‌శర్మ (ముంబై), శ్రీనివాసన్‌ (చెన్నై), కుపేంద్రరెడ్డి (బెంగళూరు) పాల్గొన్నారు. తిరుమలకు భక్తుల రాకను నిలిపివేసిన తరువాత, ఆదాయం తగ్గిపోగా, ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులకు సైతం నిధులను సర్దుబాటు చేయలేని స్థితిలో టీటీడీ ఉంది. ఈ నేపథ్యంలోనే సబ్ కమిటీల్లో ఒకటైన ఫైనాన్స్ కమిటీ సమావేశమైంది.

కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫైనాన్స్ కమిటీ మీటింగ్ విజయవంతం కావడంతో బోర్టు సమావేశం సైతం ఇదే విధానంలో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.  శ్రీవారి దర్శనాల పునరుద్ధరణ విధి విధానాలు, ఆలయాన్ని తిరిగి తెరిస్తే, కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News