ICMR: గంగా నదీ జలాలతో కరోనాపై క్లినికల్ ట్రయల్స్ కుదరదన్న ఐసీఎంఆర్

  • ‘గంగ’తో ‘కరోనా‘ పై క్లినికల్ ట్రయల్స్ కు ఎన్ఎంసీజీ ప్రతిపాదన 
  • ఈ ప్రతిపాదనపై ముందుకు వెళ్లలేమన్న ఐసీఎంఆర్
  • శాస్త్రీయ సమాచారం, ఆధారాలు బలంగా లేవు
ICMR Statement

పవిత్ర గంగానది జలాలతో కరోనా వైరస్ పై క్లినికల్ ట్రయల్స్ జరపాలని కోరుతూ భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) కి గంగా శుద్ధి జాతీయ మిషన్ (ఎన్ఎంసీజీ) ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే. జలమంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్ఎంసీ చేసిన ఈ ప్రతిపాదనపై ఐసీఎంఆర్ స్పందించింది. ఈ ప్రతిపాదనపై ముందుకు వెళ్లలేమని పేర్కొంది.

కరోనా వైరస్ ను గంగా జలాలు నిర్మూలిస్తాయనేందుకు సంబంధించిన శాస్త్రీయ సమాచారం, ఆధారాలు బలంగా లేవని స్పష్టం చేసింది. ఈ కారణాల వల్ల గంగా నదీ జలాలతో ‘కరోనా‘ పై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించలేమని స్పష్టం చేసింది. కాగా, ఇదే విషయమై అతుల్య గంగ సంస్థ కూడా ఇటీవల ఓ విన్నపం చేసింది. గంగా నది పవిత్రమైందని, ఆ నీటికి ఉన్న ప్రత్యేక లక్షణాల వల్ల అది కరోనా వైరస్ ను చంపుతుందేమో పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది.

More Telugu News