LG Polymers: గ్యాస్ లీకేజీ... ఎల్జీ పాలిమర్స్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

Case filed against LG Polymers in Vizag
  • గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
  • ఐపీసీ సెక్షన్లు 278, 284, 285, 337, 338, 304 కింద కేసు
  • హత్యాయత్నం, వాతావరణాన్ని కలుషితం చేయడం వంటి కారణాలతో కేసు
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ పై పోలీసు కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 278, 284, 285, 337, 338, 304 కింద గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. విష వాయువులతో వాతావరణాన్ని కలుషితం చేయడం, మానవ జీవనానికి హాని కలిగించడం, నిర్లక్ష్యం, పరిస్థితిని అదుపు చేయకపోవడం, హత్యాయత్నం తదితర కారణాలతో కేసు నమోదు చేశారు.
LG Polymers
Vizag
AP Police
Case

More Telugu News