AP High Court: జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమను ఎలా ఏర్పాటు చేశారు?: ఏపీ హైకోర్టు సూటి ప్రశ్న

  • వైజాగ్ లో గ్యాస్ లీకై 9 మంది మృతి
  • సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
AP High Court intervene into Vizag gas leak incident

నగరంలో జనావాసాల మధ్య ఇలాంటి పరిశ్రమ ఎలా ఏర్పాటు చేశారంటూ ఏపీ హైకోర్టు వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై సూటిగా ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ను అమికస్ క్యూరీగా నియమించింది.

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువు లీకైన ఘటనలో తొమ్మిది మంది మరణించడం తెలిసిందే. ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓ ఘటనను సుమోటోగా స్వీకరించడం అంటే ప్రభుత్వ వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

More Telugu News