Arvind Kejriwal: ఢిల్లీలో ‘కరోనా’తో మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా

CM Kejriwal Statement
  • ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అమిత్ కుమార్ ‘కరోనా’ తో మృతి
  • అమిత్  మృతి పై సీఎం కేజ్రీవాల్ దిగ్భ్రాంతి
  • రూ. కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటన
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రకటన చేశారు. అమిత్ కుమార్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఢిల్లీ లోని భరత్ నగర్ పోలీస్ స్టేషన్ లో అమిత్ కుమార్ (31) కానిస్టేబుల్. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. స్థానిక దీప్ చంద్ బందీ హాస్పిటల్ కు వెళ్లి మందులు వాడుకున్నాడు. అయినప్పటికీ ఫలితం లేకపోగా, అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం చనిపోయాడు. ఢిల్లీ పోలీస్ శాఖలో ఇదే తొలి ‘కరోనా’ మృతి అని అధికారుల సమాచారం. అమిత్ కు భార్య, మూడేళ్ల కొడుకు ఉన్నారు.
Arvind Kejriwal
New Delhi
cm
constable
Corona Virus

More Telugu News