Sensex: పెరుగుతున్న కరోనా కేసులు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 242 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 71 పాయింట్లు పతనమైన నిఫ్టీ
  • 6.58 పాయింట్లు లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
Sensex ends 242 points lower amid corona tensions

మన దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీని ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం లేదు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోయి 31,443కు పడిపోయింది. నిఫ్టీ 71 పాయింట్లు పతనమై 9,199 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (6.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (3.45%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (3.12%), యాక్సిస్ బ్యాంక్ (2.33%), టెక్ మహీంద్రా (1.73%).

టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-4.54%), ఎన్టీపీసీ (-4.49%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.69%), భారతి ఎయిర్ టెల్ (-3.34%), టైటాన్ కంపెనీ (-3.16%).

More Telugu News