మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తాం: జగన్
- గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరం
- అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారు
- ప్రమాదంపై విచారణకు ఆదేశించాం
ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా వేశామని... ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అలా జరగలేదని తెలిపారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని చెప్పారు.