Visakhapatnam District: విశాఖ దుర్ఘటనలో 6కి పెరిగిన మృతుల సంఖ్య.. కాసేపట్లో నగరానికి జగన్
- ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు నగరానికి జగన్
- బాధితులను పరామర్శించనున్న సీఎం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురి మృతి
విశాఖపట్టణం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకి పెరిగింది. ఆర్ఆర్ వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందగా, విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బాధితులతో కేజీహెచ్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది.
మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నగరానికి రానున్నారు. ప్రత్యేక విమానంలో 11:45 గంటలకు విశాఖ చేరుకోనున్న జగన్ బాధితులను కలిసి పరామర్శించనున్నారు. గ్యాస్ లీకైన ప్రాంతం నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.