Mumbai: శ్రామిక్ రైలులో.. ఆహారం కోసం కొట్టుకున్న వలస కార్మికులు!

Migrants Clash in Special Train
  • వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైలు
  • ముంబయి నుంచి దానాపూర్ కు రైలు
  • సత్నా స్టేషన్ లో బాహాబాహీ
వలస కార్మికులను తరలించేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన అధికారులు, రైలులో ప్రయాణిస్తున్న వారికి సరిపడినంత ఆహారాన్ని అందించడంలో విఫలం కావడంతో, ఓ రైలులో ప్రయాణిస్తున్న వారు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన సత్నా రైల్వే స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే...

మహారాష్ట్ర రాజధాని ముంబయి నుంచి బీహార్ లోని దానాపూర్ కు శ్రామిక్ ఎక్స్ ప్రెస్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల కోసం మార్గమధ్యంలోని సత్నా స్టేషన్ వద్ద ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైలు అక్కడికి రాగానే, ఆహారం సరిపడా లేకపోవడంతో వివాదం చోటు చేసుకుంది. ఆహారం కోసం కూలీలు పరస్పరం దాడికి దిగి, బెల్టులతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
Mumbai
Train
Migrants
Food
Danapur

More Telugu News