New Delhi: ‘బోయిస్ లాకర్ రూం’ గ్రూప్ అడ్మిన్ అరెస్ట్!

  • ఢిల్లీలో సంచలనం సృష్టించిన ‘బోయిస్ లాకర్ రూం’
  • గ్రూప్ అడ్మిన్ మేజర్ అన్న పోలీసులు
  • మరో గ్రూప్ కూడా నిర్వహిస్తున్నట్టు అనుమానం
Bois Locker Room Group Admin Arrested

దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ‘బోయిస్ లాకర్ రూం’ ఇన్‌స్టాగ్రామ్ గ్రూప్ అడ్మిన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు గ్రూప్‌ను డీయాక్టివేట్ చేశారు.

నిందితుడు ఈ ఏడాది 12వ తరగతి బోర్డు పరీక్షలు రాశాడని, అతడు మేజర్ కావడంతో అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ గ్రూపులో మొత్తం 27 మంది విద్యార్థులు ఉన్నారు. గ్రూపులోని 15 మందిని ఇప్పటికే ప్రశ్నించినట్టు పోలీసులు తెలిపారు. గ్రూపు సభ్యుల నుంచి మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. కాగా, ‘బోయిస్ లాకర్ రూం’ వంటిదే మరో గ్రూపు కూడా వీరు నిర్వహిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

దక్షిణ ఢిల్లీలోని 11, 12వ తరగతులకు చెందిన వీరంతా ‘బోయిస్ లాకర్ రూం’ పేరుతో గ్రూపుగా ఏర్పడి తోటి విద్యార్థినుల ఫొటోలు సేకరించి గ్రూపులో షేర్ చేయడంతోపాటు వారి గురించి అసభ్యంగా చర్చించుకునేవారు. వీరు చేసిన చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ బయటకు రావడంతో కలకలం రేగింది. ఓ యువతి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News