Chandrababu: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకి చంద్రబాబు విజ్ఞప్తి

Chandrababu requests Thackeray to help telugu students
  • షోలాపూర్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు
  • మహారాష్ట్ర సీఎంకు లేఖ రాయాలని చంద్రబాబును కోరిన అఖిలప్రియ
  • సురక్షితంగా వారిని పంపించాలని ఉద్ధవ్ ను కోరిన చంద్రబాబు
మహారాష్ట్రలోని షోలాపూర్ లో 100 మందికి పైగా తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయి 30 రోజులు దాటుతోందని, వీరిని వెనక్కి రప్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. వీరంతా క్షేమంగా రాష్ట్రానికి తిరిగి వచ్చేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ లను ఆమె కోరారు. అఖిలప్రియ విన్నపంపై చంద్రబాబు స్పందించారు. సమస్యను ఉద్ధవ్ థాకరే దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు.

'ఉద్ధవ్ గారూ... షోలాపూర్ లో 156 మంది విద్యార్థులు చిక్కుకుపోయిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. వారి మంచిచెడ్డలను పట్టించుకోవాలని, ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుని వారిని సురక్షింతంగా పంపాలని మిమ్మల్ని కోరుతున్నా. వారి పూర్తి వివరాలను మీకు పంపుతున్నా' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Bhuma Akhilapriya
Telugudesam
Uddhav Thackeray
Shiv Sena
Maharashtra
Telugu Students

More Telugu News