Local Body Polls: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా.. ఎస్ఈసీ ప్రకటన

Local companies postponed for some time in AP
  • ప్రస్తుత పరిస్థితులతో ఎన్నికల నిలిపివేత కొనసాగింపు
  • పరిస్థితులు అనుకూలించాక నిర్ణయం తీసుకుంటాం
  • ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ సమీక్ష
కరోనా వైరస్ కారణంగా ఏపీలో నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో  స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ నిలిపివేయాలని నిర్ణయించారు. ‘కరోనా’ అదుపులోకి రాకపోవడం, లాక్ డౌన్, హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో  పేర్కొంది. రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా’ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఈ గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ కనగరాజ్ ఇవాళ సమీక్షించారు.
Local Body Polls
Andhra Pradesh
SEC
Kanagaraj
Review

More Telugu News