Kim Jong Un: 'కిమ్ చనిపోవడం' అన్నది డ్రామాలో భాగమేనట!

  • కిమ్ మరణిస్తే ఎలాంటి కుట్రలు జరుగుతాయి?
  • దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఎవరు కుట్రలు చేస్తారు?
  • ఈ విషయాలను తెలుసుకోవడానికే చనిపోయినట్టు డ్రామా
Kim Jong death is part of a drama

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ చనిపోయారనే వార్తలు ప్రపంచాన్ని కుదిపేశాయి. కరోనా మహమ్మారి ప్రపంచంపై పంజా విసిరిన సమయంలో కిమ్ మరణ వార్త మాత్రమే పతాక శీర్షికల్లోకి ఎక్కింది. ఆ తర్వాత కిమ్ బతికే ఉన్నాడంటూ ఫొటో విడుదలైంది. మరోవైపు, కిమ్ చనిపోయినట్టు వార్తలను సృష్టించడానికి బలమైన కారణమే ఉందట. కిమ్ మరణిస్తే దేశంలో ఎలాంటి కుట్రలు జరుగుతాయి? దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఎవరు కుట్రలు చేస్తారు? వంటి అంశాలను తెలుసుకోవడానికే ఈ డ్రామా ఆడారని తెలుస్తోంది.

20 రోజులు కొనసాగించిన నాటకంలో ఎవరెవరు, ఎలాంటి కుట్రలు చేశారనే  విషయాలను కిమ్ తెలుసుకున్నట్టు సమాచారం. వీరి పని పట్టేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కిమ్ ఆడిన డ్రామా కేవలం అతికొద్ది మంది అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలుసని సమాచారం.

More Telugu News