Writ petetion: ఏపీలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్

  • ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 75 శాతం రిజర్వేషన్లు
  • దీనిని సవాల్ చేస్తూ విజయవాడ న్యాయవాది రిట్ దాఖలు
  • పిటిషనర్ తరఫున వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది జి.ఆదినారాయణ
Writ Petition to the High Court on the issue of reservation for 75 per cent of the locals in AP

ఏపీలో స్థానికులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన న్యాయవాది సి.హెచ్ వరలక్ష్మి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది జి.ఆదినారాయణ తన వాదనలు వినిపించారు. ఈ విషయమై పారిశ్రామికవేత్తలే  పిటిషన్ వేయాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుమంత్ రెడ్డి వాదించారు.

దీనిపై తమ వాదనలు వినిపించేందుకు, కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని సుమంత్ రెడ్డి కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ అంశంపై విచారణలో ప్రజాప్రయోజనం ఉందని ధర్మాసనం భావించింది. రాజ్యాంగ పరిధిలోకి లోబడే ఈ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

More Telugu News