Italy: కరోనా వైరస్‌కు టీకా అభివృద్ధి చేశామన్న ఇటలీ.. ఆశలు నింపిన ప్రకటన

  • టీకా తయారుచేసినట్టు వెల్లడించిన ఇటలీ న్యూస్ ఏజెన్సీ
  • ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో అద్భుత ఫలితాలు
  • వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్
Italy claims worlds first Covid19 vaccine

కరోనా వైరస్‌కు తాము వ్యాక్సిన్ తయారు చేసినట్టు ఇటలీ చేసిన ప్రకటనతో ప్రపంచం మొత్తం అటువైపు దృష్టి సారించింది. ప్రపంచంలోనే తొలిసారిగా తాము కరోనా వైరస్‌కు టీకా తయారుచేసినట్టు ఇటలీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఇటలీ ఈ ప్రకటన చేయగానే కరోనా బాధిత దేశాల్లో ఆశలు రేకెత్తాయి.  టకీస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను ఎలుకలపై ప్రయోగించగా అద్భుతమైన ఫలితాలు కనిపించినట్టు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

రోమ్‌లోని స్పల్లాంజనీ ఆసుపత్రిలో దీనిని పరీక్షించినట్టు పేర్కొంది. వ్యాక్సిన్ ప్రయోగంలో ఇది అడ్వాన్స్‌డ్ స్టేజ్ అని టకీస్ సీఈవో లుయిగి ఆరిసిచియో అన్నారు. ఈ వేసవి తర్వాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని ఆయన వివరించారు. ఈ వ్యాక్సిన్‌ను ఎలుకల్లో ఒక్క డోస్ ఎక్కించగానే వాటిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని, కరోనా వైరస్ మానవ కణాలకు సోకకుండా ఈ వ్యాక్సిన్ నిరోధించగలదని అరిసిచియో ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News