Mehbooba Mufti: మెహబూబాముఫ్తీ నిర్బంధం మరో మూడు నెలల పొడిగింపు

Mehbooba Mufti detention under PSA extended by 3 months
  • మరో ఇద్దరు పీడీపీ నేతల నిర్బంధం కూడా పొడిగింపు 
  • ఉత్తర్వులు జారీ చేసిన హోంశాఖ
  • గతేడాది ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ నిర్బంధంలోనే మాజీ సీఎం
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ నిర్బంధాన్ని మరో మూడు నెలలు పెంచుతూ ఆ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాజకీయ ప్రముఖులను ప్రభుత్వం నిర్బంధించింది.

ఈ క్రమంలో మెహబూబా ముఫ్తీ నివసించే ఫెయిర్ వ్యూ ఇంటినే సబ్సిడరీ జైలుగా మార్చి అందులోనే నిర్బంధాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. తొలుత ఆమెను లాల్ చౌక్ మౌలానా ఆజాద్ రోడ్డులో ఉన్న ప్రభుత్వ అతిథి గృహంలో ఉంచారు. ఆ తర్వాత ఆమెను ప్రస్తుతం ఉంటున్న ఇంటికి మార్చారు. తాజాగా, ముఫ్తీతోపాటు పీడీపీ నేతలు ముహమ్మద్ సాగర్, సర్తాజ్ మదానీల నిర్బంధాన్ని కూడా ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Mehbooba Mufti
Jammu And Kashmir
detention

More Telugu News