vijay sethupathi: ఆకలి అనే వ్యాధి ఉంది.. దానికీ ఓ వ్యాక్సిన్ కనిపెట్టాలి: నటుడు విజయ్ సేతుపతి

Actor Vijay Sethupathi asked to develop vaccine for Hungry
  • లాక్‌డౌన్ కారణంగా పేదల ఇబ్బందులు
  • తిండికి నోచుకోలేకపోతున్న పేదలు
  • వైరల్ అవుతున్న విజయ్ ట్వీట్
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో పేదలు పడుతున్న ఆకలి బాధలు అన్నీ ఇన్నీ కావు. పనుల్లేక, తినడానికి తిండిలేక వారు నానా అగచాట్లు పడుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు వారి ఆకలి బాధను తీరుస్తున్నప్పటికీ వందశాతం సాధ్యం కావడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆకలి అనే వ్యాధి ఉందని, తొలుత దానికి వ్యాక్సిన్ కనుక్కుంటే బాగుంటుందని పేర్కొన్నాడు. ప్రభుత్వాలపై సునిశిత విమర్శలు చేసే విజయ్ సేతుపతి ఇటీవల కరోనా కట్టడి గురించి మాట్లాడుతూ.. ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు దేవుడు దిగిరాడని, మనకి మనమే ఐక్యంగా ఉంటూ సహకరించుకోవడం ద్వారా దానిని తరిమికొట్టవచ్చని అన్నాడు.
vijay sethupathi
Tamil Nadu
Kollywood
vaccine
Hungry disease

More Telugu News