Telangana: కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ హైకోర్టు

Telangana Highcourt Crucial Desission on Judges Transfers
  • ఏడాది పాటు న్యాయమూర్తుల బదిలీలు నిలిపివేత
  • ప్రమోషన్లను కూడా ఆపివేస్తున్నట్టు ప్రకటన
  • అత్యవసర దరఖాస్తులతో వస్తే మాత్రం పరిశీలన
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని‌ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సంవత్సరం పాటు న్యాయమూర్తుల బదిలీలు, ప్రమోషన్లను నిలిపివేస్తున్నామని మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషన్లు వచ్చి, బదిలీలు అయ్యే న్యాయమూర్తుల వార్షిక బదిలీలపై కూడా స్టే విధిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.  

ఇదే సమయంలో న్యాయమూర్తులు ఎవరైనా వ్యక్తిగత, అత్యవసర దరఖాస్తులతో వస్తే పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, లాక్ ‌డౌన్ నిబంధనల కారణంగా ప్రస్తుతం హైకోర్టును మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర పిటిషన్లను మాత్రం న్యాయమూర్తులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తున్నారు.
Telangana
High Court
Transfers
Cancel

More Telugu News