Exams: కరోనా ఎఫెక్ట్... తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షల్లేకుండానే పై తరగతులకు!

No exams for one to ninth class in Telangana
  • మే 7వరకు రాష్ట్రవ్యాప్త లాక్ డౌన్
  • వార్షిక పరీక్షలు ఉండవన్న పాఠశాల విద్యాశాఖ
  • అన్ని పాఠశాలలకు వర్తిస్తుందంటూ ఉత్తర్వులు
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల్లేకుండానే విద్యార్థులను పై క్లాసులకు ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇది ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలన్నింటికి వర్తిస్తుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

 మే 7వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2019-20 విద్యాసంవత్సరానికి సంబంధించి 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు.
Exams
Promotion
Telangana
Corona Virus
Lockdown

More Telugu News