Murali Vijay: తనతో డిన్నర్ కు వెళ్లాలనుకుంటున్నానన్న మురళికి మహిళా క్రికెటర్ సమాధానం!

Australian woman cricketer gives hilarious reply to Murali Vijay
  • ఆసిస్ క్రికెటర్ ఎల్లిస్ తో డిన్నర్ కు వెళ్లాలనుకుంటున్నానన్న మురళి
  • ఆమె చాలా అందంగా ఉంటుందని వ్యాఖ్య
  • బిల్లు అతనే చెల్లిస్తాడనుకుంటున్నానన్న ఎల్లిస్
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. క్రికెటర్లందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులను క్రికెటర్లు అలరిస్తున్నారు. ఇటీవల టీమిండియా టెస్ట్ బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. ఈ సందర్బంగా, 'మీరు డిన్నర్ కు వెళ్లాలనుకుంటే ఎవరితో వెళతారు? ఇద్దరి పేర్లు చెప్పండి' అని ఓ అభిమాని అడిగాడు.

దీనికి సమాధానంగా... ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎల్లిస్ పెర్రితో డిన్నర్ కు వెళతానని మురళి తెలిపాడు. ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుందని  చెప్పాడు. తాను డిన్నర్ కు వెళ్లాలనుకుంటున్న రెండో క్రికెటర్ శిఖర్ ధావన్ అని తెలిపాడు. ధావన్ ఎంతో సరదాగా ఉంటాడని, తాను తమిళంలో మాట్లాడుతుంటే ధావన్ హిందీలో మాట్లాడుతుంటాడని చెప్పారు.

ఈ నేపథ్యంలో మురళి సమాధానంపై ఎల్లిస్ పెర్రీ స్పందించింది. తనతో డిన్నర్ చేయాలనుకుంటున్న మురళికి ధన్యవాదాలు అని చెప్పింది. అయితే, బిల్లు అతనే చెల్లిస్తాడనుకుంటున్నానని సరదాగా రిప్లై ఇచ్చింది.
Murali Vijay
Ellyse Perry
Australia
Women Cricketer
Dinner
Team India

More Telugu News