Vijay Devarakonda: చిరంజీవి గారు.. యాక్షన్ ప్లాన్ కావాలి: నాగార్జున

Nagarjuna appreciates Chiranjeevi in supporting Vijay Devarakonda
  • విజయ్ దేవరకొండకు పెరుగుతున్న మద్దతు
  • అండగా ఉన్నందుకు చిరుకు అభినందనలు తెలిపిన నాగ్
  • అయితే కేవలం అండగా ఉంటే సరిపోదని వ్యాఖ్య
తనపై నాలుగు వెబ్ సైట్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని, తన కెరీర్ ను నాశనం చేసేందుకు యత్నిస్తున్నాయని  హీరో విజయ్ దేవరకొండ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్ కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. నీకు అండగా ఉన్నామంటూ  ఇప్పటికే చిరంజీవి, మహేశ్ బాబు, నాగబాబు, కొరటాల శివ తదితరులు స్పందించారు.

ఈ నేపథ్యంలో నాగార్జున కూడా స్పందించారు. చిరంజీవి ట్వీట్ పై ఆయన స్పందిస్తూ... సినీ పరిశ్రమలోని సహచరుడికి అండగా నిలబడటం అభినందనీయమని కొనియాడారు. మహేశ్, రవితేజ, రానా, కొరటాల శివ, క్రిష్, వంశీ పైడిపల్లి అందరూ నీకు అండగా ఉన్నారని విజయ్ దేవరకొండకు భరోసా కల్పించారు.

అయితే, కేవలం అండగా ఉంటే సరిపోదని... ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మనకు ఒక యాక్షన్ ప్లాన్ కావాలని నాగార్జున ట్వీట్ చేశారు.
Vijay Devarakonda
Chiranjeevi
Nagarjuna
Mahesh Babu
Tollywood

More Telugu News