Balakrishna: బాలయ్య పక్కన బంపరాఫర్ కొట్టేసిన జార్జిరెడ్డి 'శాండీ'

George Reddy fame Sandeep to act in Balakrishna Movie
  • బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో కొత్త చిత్రం
  • కీలక పాత్రలో సందీప్ మాధవ్ కు ఆఫర్ 
  • సందీప్ కూడా ఓకే చేసినట్టు వార్తలు
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో యంగ్ హీరో, 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్ నవీన్ పోలిశెట్టి నటించబోతున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే, ఆ వార్తలను నవీన్ ఖండించాడు. తనకు అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని చెప్పాడు.

తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. 'వంగవీటి', 'జార్జిరెడ్డి' సినిమాల ద్వారా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సందీప్ మాధవ్ ఈ చిత్రంలో ఛాన్స్ కొట్టేశాడనే వార్త వినిపిస్తోంది. సినిమాలో బాలయ్యకు అత్యంత దగ్గరగా ఉండే పాత్రలో నటించమని అడిగినట్టు, అందుకు సందీప్ అంగీకరించినట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుత కరోనా పరిస్థితులు కొంత చక్కబడిన తర్వాత సినిమాకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని దర్శకుడు బోయపాటి ఇటీవల తెలిపిన సంగతి తెలిసిందే.
Balakrishna
Boyapati Sreenu
Sandeep Madhav
Tollywood

More Telugu News