Liquor Sales: ఉత్తరప్రదేశ్ లో నిన్నటి మద్యం అమ్మకాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే! 

Rs 100 cr liquor sales in UP on first day
  • పలు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి ప్రారంభమైన మద్యం అమ్మకాలు
  • ఏపీలో రూ. 60 కోట్ల అమ్మకాలు
  • యూపీలో రూ. 100 కోట్లు దాటిన సేల్స్
దేశ వ్యాప్తంగా నిన్న పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తర్వాత లిక్కర్ షాపులు తెరుచుకోవడంతో అన్ని రాష్ట్రాల్లో జనాలు క్యూ కట్టారు. బెంగళూరులో మహిళలు ప్రత్యేకంగా పెద్ద క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాను షేక్ చేసింది.

ఇదిలావుంచితే, ఏపీలో నిన్న దాదాపు రూ. 60 కోట్ల మద్యం వ్యాపారం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో అయితే కళ్లు చెదిరే రీతిలో వ్యాపారం జరిగింది. ఏకంగా రూ. 100 కోట్ల పైగా అమ్మకాలు జరిగాయని ఆ రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. రాజధాని లక్నోలో 4 గంటల సేల్స్ తగ్గినా ఏకంగా రూ. 6.3 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ రేంజ్ లో వ్యాపారం జరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
Liquor Sales
UP
AP

More Telugu News