Pawan Kalyan: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తప్పారు: పవన్ కల్యాణ్ ఫైర్

  • మద్యనిషేధం అని చెప్పి మాట మార్చారు
  • వైన్ షాపుల వద్ద సోషల్ డిస్టెన్స్ అవసరం లేదా?
  • మద్యం అమ్మకాల తొలిరోజే ఆత్మహత్యలు జరగడం బాధాకరం
Dont bring the morale of teachers says Pawan Kalyan

ఏపీలో నిన్నటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. దాదాపు  40 రోజుల తర్వాత మందు షాపులు తెరుచుకోవడంతో... మందుబాబులు పోటెత్తారు. కరోనా విస్తరిస్తున్న తరుణంలో మందు అమ్మకాలను ప్రారంభించిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తనదైన శైలిలో ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.

'వైసీపీ ప్రభుత్వం కరోనా ఫ్రెండ్లీగా మారింది. సంపూర్ణ మద్య నిషేధాన్ని తీసుకొస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైసీపీ... అధికారంలోకి వచ్చాక విడతల వారీగా బంద్ చేస్తామని మాట మార్చింది. మద్యాన్ని నిషేధించడానికి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడొక మంచి అవకాశం. కానీ వారు వైన్ షాపులు తీసేందుకే మొగ్గుచూపారు' అని పవన్ చెప్పారు. దాని ఫలితం ఇదేనంటూ సోషల్ డిస్టెన్స్ లేకుండా పొడవాటి క్యూలో జనాలు నిల్చున్న వీడియోను పోస్ట్ చేశారు.

సామాజిక దూరం పాటించడం కష్టమంటూ ఆలయాలు, చర్చిలు, మసీదులను బలవంతంగా మూసేశారని... లిక్కర్ షాపులకు మాత్రం ఇది వర్తించదా? అని ప్రశ్నించారు. మద్యం విక్రయాలకు సామాజిక దూరం లేకపోయినా పర్వాలేదా? అని అన్నారు.

మద్యం దుకాణాలను ప్రారంభించిన రోజే  ఆత్మహత్యలు చోటుచేసుకోవడం కలచివేసిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో భార్య, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారనే వార్తను ట్విట్టర్  లో షేర్ చేశారు.

More Telugu News