Vijay Sai Reddy: ఈ వార్త పబ్లిష్ కాకుండా మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబును ఏం చేయాలి?: విజయసాయిరెడ్డి

  • ఉప్పల్ హెరిటేజ్ సంస్థ‌లో నలుగురికి కరోనా వైరస్ సోకింది
  • ఆ నలుగురి వల్ల 25 మంది క్వారంటైన్ లో ఉన్నారు
  • బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా?
Vijayasai reddy criticises chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లోని ఉప్పల్ హెరిటేజ్ సంస్థ‌లో నలుగురికి కరోనా వైరస్ సోకిందని, వారి వల్ల 25 మంది క్వారంటైన్ లో ఉన్నారని అన్నారు. కరోనా బారినపడ్డ వీరంతా సత్వరం కోలుకోవాలని విజయసాయి ఆకాంక్షించారు.

అయితే, ఈ వార్త పబ్లిష్‌ కాకుండా, టెలికాస్ట్‌ కాకుండా మీడియాను మేనేజ్‌ చేసిన చంద్రబాబును ఏం చేయాలి? బాబు ప్రవచనాలు తన కంపెనీకి వర్తించవా? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పది ఇళ్ళకో బెల్టు షాపు కొనసాగితే ఎక్కడా క్యూలు ఉండేవి కావని, జగన్ సీఎం అయ్యాక బెల్టు షాపులే లేకుండా చేశారని అన్నారు. వైన్ షాపుల సంఖ్య తగ్గించడం వల్ల జనాల్లో కొంత ఆతృత కనిపిస్తోందని, ఎన్టీర్ తెచ్చిన మద్య నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి గుండెలు బాదుకుంటుంటే నవ్వొస్తోందంటూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.

More Telugu News