Corona Virus: ఫలితాలిస్తున్న రెమిడీసివిర్.. ఇండియాలో రోగులపై ట్రయల్స్ ప్రారంభం!

Corona virus medicine trials started in India
  • పెద్ద ఎత్తున తయారవుతున్న రెమిడీసివిర్
  • ఇండియాలో ట్రయల్స్ కోసం 1000 డోసులు సిద్ధం
  • ట్రయల్స్ ఫలిస్తే... ఇండియాలో కమర్షియల్ గా ఉత్పాదన
కరోనా వైరస్ ను అరికట్టే ఔషధాన్ని తయారు చేసేందుకు పలు దేశాల్లో ప్రయోగాలు జరుగుతున్నాయి. గిలీడ్ ఫార్మా సంస్థ ఇటీవలే రెమిడీసివిర్ అనే మెడిసిన్ ను మనుషులపై ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఫస్ట్ ట్రయల్ లో ఈ మెడిసిన్ ఫెయిల్ అయింది. తాజాగా కొంత మేర అది మంచి ఫలితాలను సాధించినట్టు తెలుస్తోంది. కరోనా రోగులకు ఈ మెడిసిన్ ను వాడవచ్చని అమెరికా ఆమోదం తెలపడంతో... తొలి విడతగా 1.5 మిలియన్ డ్రగ్ డోస్ ను తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్ పరిశోధనలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వాములు అయ్యారు.

తాజాగా ఇండియాలో కూడా రెమిడీసివిర్ మెడిసిన్ ను ట్రయల్స్ గా వినియోగించనున్నారు. దీని కోసం 1000 డోసులు సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని కరోనా రోగులకు ఇవ్వబోతున్నారు. ఈ ట్రయల్స్ ఫలితాలను ఇస్తే... ఇండియాలో కూడా వీటిని కమర్షియల్ గా తయారు చేసే అవకాశం ఉంది.
Corona Virus
Medicine
Trials
India

More Telugu News